కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ యూఎస్ తో పాటు ఇతర దేశాల్లోనూ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం అన్ని భాషల్లోనూ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 2021లో కొన్ని పెద్ద హాలీవుడ్ సినిమాల విడుదలలను పరిగణనలోకి తీసుకుని సినిమా హాళ్ళపై ఆంక్షలు ఎత్తివేయనున్నారు. ఆగస్టు 5న భారతదేశంలో “సూసైడ్ స్క్వాడ్” విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఇండియాలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న “ఎఫ్9” కూడా అదే తేదీకి రావాల్సి ఉంది. కానీ పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది. తాజాగా సినిమా కొత్త విడుదల తేదీ ఖరారు అయ్యింది. విన్ డీజిల్, జాన్ సెనా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 19న ఇండియాలో విడుదల కానుంది.
Read Also : పద్మా పాటిల్ : ‘హ్యారీ పాటర్’లో అమ్మాయి… ఇప్పుడు అమ్మ!
హర్రర్ ఫ్రాంచైజ్ “కంజురింగ్ : డెవిల్ మేడ్ మి డు” ఆగస్టు 13 నుండి థియేటర్లలోకి రానుంది. ఈ ఫ్రాంచైజ్ చిత్రాలతో పాటు సెప్టెంబర్ 10న “ది బాస్ బేబీ : ఫ్యామిలీ బిజినెస్”, అకాడమీ అవార్డు నామినీ “ప్రామిసింగ్ యంగ్ వుమన్”, ఆగస్టు 6న “ది క్రూడ్స్, “సెప్టెంబర్ 17న ది ఫరెవర్ పర్జ్” విడుదల కానున్నాయి. ఇక కరోనా మహమ్మారి థియేటర్ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ సమయంలో పెద్ద సినిమాల విడుదల ఇండియా బాక్స్ ఆఫీస్ కు చాలా ముఖ్యం.
