EVV Cinema: కోర్టు రోషన్’తో ఈవీవీ కుమారుడి సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన లెజెండరీ నిర్మాణ సంస్థ ‘ఈవీవీ సినిమా’ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దివంగత ప్రముఖ దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ బ్యానర్, ‘ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థతో చేతులు కలిపి ఒక విలక్షణమైన చిత్రాన్ని పట్టాలెక్కించింది. ఈవీవీ సినిమా బ్యానర్లో వస్తున్న ప్రొడక్షన్ నెం.10, అలాగే ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ఈవీవీ సినిమా బ్యానర్‌పై ఈవీవీ తనయుడు, నటుడు ఆర్యన్ రాజేష్ నిర్మాతగా మారారు. ఆయన మరో నిర్మాత ఎన్.వి.కృష్ణారెడ్డితో కలిసి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తిగా ఒక నిజ జీవిత కథ ఆధారంగా, మనసుకు హత్తుకునే తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన ఒక ఇంటెన్స్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ‘కోర్ట్’ సినిమాతో నటుడిగా విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుని, టాలీవుడ్లో ప్రామిసింగ్ యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రియాంక ఆచర్ నటిస్తోంది. ఈ కొత్త తరం ప్రేమకథను అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా డైరెక్ట్ చేయనున్నారు. నిజ జీవితంలో ఉండే ఎమోషన్స్, మానవ సంబంధాల చుట్టూ ఈ కథను వారు అల్లినట్లు తెలుస్తోంది.
llywood News
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!