Site icon NTV Telugu

ఈషా ఈజ్ బ్యాక్… నిర్మాతగా న్యూ ఇన్నింగ్స్! నటిగా సెకండ్ ఇన్నింగ్స్!

Esha Deol turns producer with Ek Duaa

పెళ్లైన హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టటం దాదాపుగా తప్పనిసరే! అదే పని చేస్తోంది హేమా మాలిని కూతురు ఈషా డియోల్. భరత్ తఖ్తానీని పెళ్లాడిన మిసెస్ ఈషా ఇద్దరు అమ్మాయిలకు తల్లి కూడా. అయితే, కూతుళ్లు ఇద్దరు కాస్త పెద్దవారవటంతో మరోసారి కెమెరా ముందుకు వచ్చేసింది ఈషా. అయితే, నటిగానే కాదు నిర్మాతగా కూడా బరిలో దిగుతోంది టాలెంటెడ్ బ్యూటీ…

ఈషా డియోల్ తఖ్తానీ భర్త భరత్ తో కలసి ‘భరత్ ఈషా ఫిల్మ్స్’ ప్రారంభించింది. అంతే కాదు, ఇప్పటికే ‘ఏక్ దువా’ అనే సినిమాని ఆమె నటిస్తూ నిర్మించింది కూడా! త్వరలో ‘వూట్ సెలెక్ట్’ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఆడవాళ్లకు సంబంధించిన ఓ కీలకమైన అంశంపై మంచి సందేశంతో, వినోదంతో ‘ఏక్ దువా’ సాగుతుందట. అసలు కథతో పాటూ దర్శకుడు రామ్ కమల్ ముఖర్జీ తన వద్దకు తొలిసారి వచ్చినప్పుడే ఈషా ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుందట. కేవలం యాక్టర్ గా కాకుండా ప్రొడ్యూసర్ గానూ బాధ్యత తీసుకుందట. ‘ఏక్ దువా’లోని పాయింట్ నచ్చటమే ఈషా నిర్ణయానికి కారణమని సోషల్ మీడియాలో చెప్పింది.

Read Also : బాలీవుడ్ హీరోతో ‘స్టెతస్కోప్’ లవ్ సెట్ చేసుకుంటోన్న రకుల్!

నిర్మాతగా న్యూ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈషా డియోల్ నటిగా మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధమవుతోంది. అజయ్ దేవగణ్ తో ఆమె ‘రుద్రా’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. చూడాలి మరి, ఓ సినిమా, ఒక సిరీస్ తో వస్తోన్న సీనియర్ సుందరి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో!

Exit mobile version