బాలీవుడ్ హీరోతో ‘స్టెతస్కోప్’ లవ్ సెట్ చేసుకుంటోన్న రకుల్!

ఆయుష్మాన్ ఖురానా భోపాల్ కి బయలుదేరాడు. మధ్యప్రదేశ్ రాజధానిలో సుమారు నెల రోజుల పాటూ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ‘డాక్టర్ జి’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమా తాజాగా ప్రారంభమైంది. ఇందులో సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఆయుష్మాన్ కు సీనియర్ గా, ‘డాక్టర్ ఫాతిమా’ పాత్రలో రకుల్ కనిపిస్తుందట. ఇక హీరో క్యారెక్టర్ కూడా ‘డాక్టరే’. ఆయుష్మాన్ ‘డాక్టర్ ఉదయ్ గుప్తా’గా ‘డాక్టర్ జి’లో అలరించనున్నాడు.

Read Also : అక్షయ్ కుమార్ కి మళ్లీ ఝలక్ ఇచ్చిన కరోనా! సినిమా వాయిదా…

హీరో, హీరోయిన్ ఇద్దరూ వైద్యులుగా కనిపించే అప్ కమింగ్ ఎంటర్టైనర్ లో అసలు కథేంటో ఇంకా బయటకు చెప్పటం లేదు. కాకపోతే, ఆయుష్మాన్ ఉన్నాడంటే సినిమాలో ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందని భావించవచ్చు. వీర్యం దానం చేసే నిరుద్యోగి మొదలు గుడ్డివాడుగా నటించే గాయకుడి దాకా ఆయన వైవిధ్యమైన పాత్రలు చేస్తూనే వస్తున్నాడు. అబ్బాయిగా, అమ్మాయిగా, గే లవ్వర్ గా కూడా ఖురానా నటించేశాడు! ఇక ఇప్పుడు ‘డాక్టర్ జి’లో ఎలాంటి సర్ ప్రైజ్ ఎలిమెంట్ తో మన ముందుకు వస్తాడో చూడాలి…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-