Erracheera: ఏప్రిల్ 25న ‘ఎర్రచీర – ది బిగినింగ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా, బేబీ డమరి సమర్పణలో నిర్మితమవుతున్న చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25, 2025న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ఈ చిత్రంలో నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వయంగా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. తల్లి సెంటిమెంట్‌తో పాటు హారర్, యాక్షన్ అంశాలను మేళవించిన ఈ సినిమా, మొదట శివరాత్రి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఆ షెడ్యూల్ వాయిదా పడింది. ఇప్పుడు వేసవి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి టీమ్ పక్కా ప్లాన్‌తో సన్నద్ధమవుతోంది.
నిర్మాత ఎన్ వివి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం అద్భుతంగా తీర్చిదిద్దాము. అఘోరాలతో శివుడిని చూపించే ఒక సీక్వెన్స్ షూట్ చేశాం, అది అద్భుతంగా వచ్చింది. ఇది కుటుంబంతో సహా పిల్లలు కూడా ఆనందించే సినిమా అవుతుంది,” అని తెలిపారు. దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ, “ఈ సినిమాలో 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికే సినిమా చూసిన వారు దీన్ని అద్భుతంగా మెచ్చుకున్నారు. విడుదల ఆలస్యమైనప్పటికీ, కంటెంట్ మాత్రం దిమ్మతిరిగేలా ఉందని అందరూ అంటున్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అసాధారణ అనుభూతిని పంచుతుందని ఆశిస్తున్నాం,” అని చెప్పారు. ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతోంది.
Also Read
- Tags
తాజావార్తలు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
-
Yusmarg Encounter: భద్రతా బలగాలకు కీలక విజయం.. లష్కర్ కమాండర్ యాసిర్ ఎన్కౌంటర్..
-
AP Employees: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. ఒకేసారి రెండు డీఏలు..
-
C Kalyan : కోట్ల రూపాయల నిర్మాతల సొమ్ము ఎవరు అనుభవిస్తున్నారో అందరికీ తెలుసు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!