మిల్కీ బ్యూటీ లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో తాజాగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ‘గర్జన’. తమిళ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవ్ గిల్, నైరా, వైష్ణవి ముఖ్య పాత్రలో నటించారు. జె ప్రతిభన్ దర్శకత్వం వహించారు. అరుల్ దేవ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా ఆర్.సుదర్శన్, ఆర్ట్ డైరెక్టర్ గా మిలన్ పని చేశారు. ఈ చిత్రానికి సురేశ్ కొండేటి పి.ఆర్.ఓ గా చేస్తుండగా… బి వినోద్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఎప్పుడు మనసున…’ అనే మెలోడీ సాంగ్ ను మేల్ వెర్షన్ లో విడుదల చేశారు. శరత్ సంతోష్ ఈ సాంగ్ ను ఆలపించగా… హర ఉప్పాడ లిరిక్స్ అందించారు. మీరు కూడా ‘ఎప్పుడు మనసున…’ మెలోడీ లిరికల్ సాంగ్ ను వీక్షించండి.
గర్జన : ‘ఎప్పుడు మనసున…’ మెలోడీ సాంగ్ మేల్ వెర్షన్
