Site icon NTV Telugu

“కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ వచ్చేసింది…!

Enticing Melody Kannulu Chedire from WWW movie

ఆది తరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. హూ వేర్ వై అనేది దాని అర్థం. తాజాగా ఈ చిత్రం నుంచి “కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ విడుదలైంది. యంగ్ హీరో అడవి శేష్ ఈ సాంగ్ ను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను యాజిన్ నిజార్ ఆలపించగా… అనంతశ్రీరామ్ లిరిక్స్ అందించారు.సైమన్ కె కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో ప్రియదర్శి, వివా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ఇటీవలే “లాక్ డౌన్” అనే ట్యాప్ సాంగ్ ని విడుదల చేశారు. తెలుగులో విడుదలైన ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం విడుదలైన “కన్నులు చెదిరే” మెలోడీ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

Exit mobile version