EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో బైక్, కారు, ఖరీదైన స్మార్ట్ ఫోన్.. ఇలా ఏది కొన్నా ఈఎంఐ (EMI) కట్టాల్సిందే. మధ్యతరగతి యువత ఈ ఈఎంఐల ఊబిలో చిక్కుకుని ఎలాంటి అవస్థలు పడుతున్నారు? నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? అనే అత్యంత ఆసక్తికరమైన, వాస్తవిక అంశంతో టాలీవుడ్లో ఓ సంచలన చిత్రం తెరకెక్కబోతోంది. అదే “ఇ.ఎం.ఐ” (E.M.I). ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సరికొత్త మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మధ్యతరగతి ఇళ్లల్లో ప్రతి నెలా ఈఎంఐలు కట్టేందుకు పడే కష్టాలను, అందులోని సున్నితమైన ఎమోషన్స్‌ను కంప్లీట్ ఎంటర్టైనర్గా మలిచి ప్రేక్షకులకు అందించబోతున్నారు. ముహూర్తపు సన్నివేశానికి టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ దర్శకుడు సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ నూతన దర్శకుడు నిఖిల్ కువ్వరపుకు స్క్రిప్ట్‌ను అందజేశారు.
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ సినిమాలో ఫ్రెష్ ఫేసెస్ను పరిచయం చేస్తున్నారు. ‘లాల్ సలామ్’, ‘హాస్టల్ డేస్’ లాంటి వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దరహాస్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో తనదైన నటనతో మెప్పించిన శైలజ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఉండబోతోందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ.. ఈ సినిమాతో పాటు ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని సైతం నిర్మించబోతోంది. దానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ ‘ఇ.ఎం.ఐ’ చిత్రానికి సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాంకేతిక నిపుణుల పరంగా ఫహాద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మాధవ్ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీధర్ సొంపల్లి ఎడిటర్‌గా, సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read
- Mythri Ravi: 'తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!