‘’అదొక షో కాదు… అదో చరిత్ర!’’ అంటోంది ఏక్తా కపూర్! ఇండియన్ డైలీ సోప్ ఓపెరాన్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న లేడీ ప్రొడ్యూసర్ ఒక దశలో తన సీరియల్స్ తో సెన్సేషన్ సృష్టించింది. తరువాత సినిమాలు, ఇప్పుడు ‘ఆల్టా బాలాజీ’తో ఓటీటీ కంటెంట్ ఆమె ప్రేక్షకులకి అందిస్తోంది. అయితే, దీనికంతటికీ ప్రారంభం ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’!
Read Also : “ప్లీజ్ కమ్ బ్యాక్” అంటూ ఎల్లో బికినీలో కియారా రచ్చ
సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఏక్తా కపూర్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్ రూపొందించింది. ఇవాళ్టి మన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అప్పట్లో ప్రధాన పాత్ర పోషించింది. ‘కలవారి కోడలు’గా ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక ఏక్తా కపూర్ బాలాజీ టెలివిజన్స్ అయితే రాత్రికి రాత్రి అతి పెద్ద టెలివిజన్ బ్రాండ్ నేమ్ గా ఆవిర్భవించింది. ఇన్ని విశేషాలకు కారణమైన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ 21 ఏళ్ల క్రితం జూలై 3న మొదలైంది. ఆ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. సక్సెస్ ఫుల్ సీరియల్ తాలూకూ టీమ్ మెంబర్స్ అంతా పార్టీ చేసుకుంటూ కనిపించారు త్రోబ్యాక్ వీడియోలో. ‘’ఎన్నో ఏళ్ల క్రితం… ఇదే రోజు… నా జీవితాన్ని మార్చేసింది! థాంక్ క్యూ!’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఏక్తా. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీతో పాటూ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ’ సీరియల్ కి పని చేసిన మరికొంత మందిని ఆమె ట్యాగ్ చేసింది…
