Site icon NTV Telugu

ఈషాకు గాయం.. ఆ మచ్చపై అభిమానుల ఆందోళన

తెలుగమ్మాయి ఈషా రెబ్బా అందం, అభినయంతో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా ఈషా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్‌తో సందడి చేసే ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే తాజాగా ఈషా భుజంపై ఎర్ర‌గా కందిన గాయం నెటిజన్స్ కి కనిపిస్తుంది. ఇంకేముంది.. తెగ కామెంట్స్ తో ఏమైంది అంటూ అడుగుతున్నారు. వ్యాక్సినేషన్ కారణంగా గాయం అయ్యి ఉంటుందని కొందరు అంటే.. వ్యాక్సినేషన్ వల్ల కాదు.. కాదు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అది గాయము కాదు, మచ్చ అంతకంటే కాదు, అదోరకం అందం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపైనా ఈషా ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి!

Exit mobile version