NTV Telugu Site icon

Nani : భారీ స్థాయిలో దసరా -2 ..బడ్జెట్ ఎంతంటే..?

Untitled Design (1)

Untitled Design (1)

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా ఘన విజయం సాధించింది. తెలంగాణా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నాని కెరీర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పక్కా మాస్ మసాలా ఫార్ములాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని దాదాపు రూ .75 కోట్లతో నిర్మించాడు.

ఏడాది తర్వాత దసరా కు సిక్వెల్ ప్రకటించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. దసరాకు తెలంగాణ, ఓ ఇద్దరు స్నేహితుల మధ్య సాగే కథను ఎంచుకున్న దర్శకుడు, సిక్వెల్ కు సికింద్రాబాద్ నేపథ్యంలో జరిగే కథను ఎంచుకున్నాడని తెలుస్తోంది. అందుకోసం భారీ సెట్లు, భారీ టెక్నిషియన్స్ పని చేయనున్నారు. కానీ మొదటి భాగానికి రెండవ భాగానికి సంబంధం ఉండదని కేవలం సోల్ ని మాత్రమే తీసుకుని మిగిలిన స్టోరీ మొత్తాన్ని సరికొత్తగా రెడీ చేసినట్టు దర్శకుడు తెలిపాడు. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చేనెల 29న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. దసరా – 2ను జనవరి లేదా ఫిబ్రవరి నుండి మొదలెట్టే ఆలోచన చేస్తున్నాడు నాని. ఈ చిత్రంలో నానికి జోడిగా బాలీవుడ్ అందాల రాసి జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది. మొదటి భాగానికి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. ఈ సిక్వెల్ ను దాదాపు రూ.120 నుండి రూ. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు సుధాకర్ చెరుకూరి.

 

Also Read: Kalki : ప్రభాస్, అమితాబ్ కు లీగల్ నోటిసులు..అసలేమైందంటే..?

Show comments