మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు తెరకు సుపరిచితమే. గతంలో దుల్కర్ నటించిన అనేక డబ్బింగ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయి విజయం సాధించాయి. ఆ మధ్య మహానటిలో జెమినీగణేశన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. ఆలా తెలుగులో దుల్కర్ లీడ్ రోల్ లో వచ్చిన మొదటి సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ ఉత్సహంతో మరొక సినిమాకు సైన్ చేసాడు ఈ మలయాళ హీరో.
Also Read : 35 Movie : ’35 చిన్న కథ కాదు’.. ఎటు చుసినా థియేటర్స్ హౌస్ ఫుల్స్ : రానా దగ్గుబాటి
ధనుష్ ను టాలివుడ్ కు పరిచయం చేసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
అక్టోబర్ 31న రిలీజ్ కానుంది ఈ సినిమా. తాజాగా మరొక తెలుగు సినిమాను పట్టాలెక్కించాడు దుల్కర్ సల్మాన్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ” కాంతా” అనే సినిమాను స్టార్ట్ చేసాడు. ఇటీవల మిస్టర్ బచ్చన్ లో అలరించిన భాగ్యశ్రీబోర్స్ దుల్కర్ సరసన ఆడిపాడనుంది. గడచిన ఆదివారం ఈ సినిమా షూటింగ్ ను పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ , దుల్కర్ సొంత ప్రొడక్షన్ వేఫారెర్ బ్యానర్స్ కలిసి రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో తీసుకురానున్నారు. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ గతంలో “ది హంట్ ఫర్ వీరప్పన్”కి రచయిత, ఒక ఎపిసోడ్ కి దర్శకత్వం వహించారు. “లైఫ్ ఆఫ్ ఫై” కోసం ఆన్-సెట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ కూడా చేసాడు.