NTV Telugu Site icon

దుల్క‌ర్ స‌ల్మాన్‌ సినిమా గ్లిమ్స్ విడుద‌ల‌!

Dulquer Salmaan plays Lieutenant Ram in Hanu Raghavapudi film

‘ఓకే బంగారం, మ‌హాన‌టి, క‌నులు క‌నుల‌ను దోచాయంటే’ వంటి విజయవంతమైన చిత్రాల‌తో తెలుగులో కూడా మంచి గుర్తింపు ద‌‌క్కించుకున్నారు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన కాన్సెప్ట్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వీడియో గ్లిమ్స్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఈ వీడియోలో మ‌ద్రాస్ ఆర్మీ ఆఫ‌స‌ర్ లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్‌ స‌ల్మాన్ న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. `ప్రేమకోసం ఆ శ్రీ రాముడి యుద్ధం చిర‌స్మ‌ర‌ణీయం..త్వ‌ర‌లో త‌న ప్రేమ కావ్యంతో మ‌న ముందుకు మా లెఫ్ట్‌నెంట్ రామ్.. చెడుపై మంచి త‌ప్ప‌కుండా గెలుస్తుంది. అంత వ‌ర‌కూ సేఫ్‌గా ఉండండి’ అని తెలిపింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.