NTV Telugu Site icon

Dulquer Salmaan : సెంచరీకి చేరువలో ‘లక్కీ భాస్కర్’

Lakki Baskar

Lakki Baskar

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ హిట్ “లక్కీ భాస్కర్”.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు క్రిటిక్స్ ను ఇటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. తమిళ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.

Also Read :Kiran Abbavaram : “క” మూవీ టీమ్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా దుల్కర్ నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం ఆడియెన్స్ ను అలరించింది. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 12.7 కోట్లు కొల్లగొట్టి దుల్కర్ కి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిపెట్టింది. ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకుంది. డబ్బు అన్నిటికి మూలం, అది ఉంటేనే ఎవరికైనా వాల్యూ ఉంటుంది అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో 11 రోజులకు గాను 96. 08 కోట్లు సాధించింది. తెలుగులో స్టడీగా కలెక్షన్స్ వస్తున్న ఈ సినిమా తమిళ్ లో ఊహించినదానికంటే ఎక్కువ పర్ఫామ్ చేస్తోంది. ఇప్పటికి రూ. 11కోట్లకు పైగా రాబట్టి బయ్యర్స్ కు లాభాలు తెచ్చి పెట్టింది. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరనుంది.

 

Show comments