Dulquer Salmaan: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను చేర్చినట్లు టాలీవుడ్, మాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ప్రతి సినిమాతో ఏదో ఒక సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేసే దర్శకులతో చేతులు కలిపే దుల్కర్.. ఈసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్‌తో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టే టేకింగ్, యూత్‌ను కట్టిపడేసే అదిరిపోయే సీన్లతో థియేటర్లను షేక్ చేసిన ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో దుల్కర్ నటించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ‘రోమాంచం’, ‘ఆవేశం’ రీసెంట్ ‘సీన్’ చిత్రాలతో బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసిన జితు మాధవన్, ఈసారి దుల్కర్ కోసం ఓ హై-వోల్టేజ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరగడానికి కారణం ఇందులో నటించబోయే హీరోయిన్. ‘ప్రేమలు’ చిత్రంతో దేశవ్యాప్తంగా యంగ్ సెన్సేషన్ హీరోయిన్‌గా మారిన మమిత బైజూ ఇందులో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మమిత నేచురల్ యాక్టింగ్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు దుల్కర్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే వెండితెరపై ఫ్రెష్ వైబ్ రావడం ఖాయం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్నమైన కథాంశాలు, బలమైన సన్నివేశాలతో అలరించే జితు మాధవన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ – మమిత బైజూల క్రేజీ కాంబో రాబోతున్నట్లు వార్తలు వైరల్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం దుల్కర్ నవంబర్ 20న ఆకాశంలో ఒక తార చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు.

