Site icon NTV Telugu

Dulquer Salmaan : రెండు డిజాస్టర్ నుంచి తప్పించుకున్న దుల్కర్..

Dulkar Salman

Dulkar Salman

మలయాళ నటుడు అయినప్పటికి దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ ఎంత మంచి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ‘మహానటి’,‘సీతారామం’ రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ వంటి మూవీతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్‌గా ‘లక్కీ భాస్కర్’ మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ హీరో ఓ రెండు భారీ డిజాస్టర్ చిత్రాల నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా హీరో కమల్ హాసన్‌వే కావడం.

Also Read : Naslen : మ‌ల‌యాళ చిత్రం ‘అల‌ప్పుళ జింఖానా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

అవును కమల్ నటించిన ‘ఇండియన్-2’ సినిమాలో సిద్ధార్థ్ చేసిన పాత్రకు తొలుత దుల్కర్‌ను తీసుకున్నారు. కానీ, ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో సిద్ధార్థ్ నటించాడు. ఇక ఆ సినిమా ఎలాంటి టాక్‌తో నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘థగ్ లైఫ్’ లోనూ శింబు చేసిన పాత్ర కోసం దుల్కర్‌ను సంప్రదించారట. కానీ, ఆయన ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట. ఇక ఈ సినిమాకు దారుణమైన రిజల్ట్ వస్తుండడంతో, ఇది కూడా మరో ‘ఇండియన్-2’ మూవీగా అవతరించనుందని విమర్శకులు అంటున్నారు. దీంతో దుల్కర్ ఈ రెండు కళాఖండాల నుంచి తప్పించుకోవడం నిజంగా అతని లక్కీ అని చెప్పాలి.

Exit mobile version