NTV Telugu Site icon

Dulquer Salmaan: చూడటానికలా ఉంటాడు కానీ ఎంతో టాలెంట్ ఉంది!

Dulquer Salmaan Speech

Dulquer Salmaan Speech

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ అందరితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సాయి కుమార్ వాయిస్ అనేది ఆయనకు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకి బ్లెస్సింగ్. నా చిన్నప్పుడు రాంకీ నటన అంటే ఇష్టం. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడమనేది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. షూటింగ్ లో ఎంతో సహకరించారు.

Hanu Raghavapudi: నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా అని అడిగారు!

సుమతి పాత్రతో మీనాక్షి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీవోపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. మీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాగి, స్వప్న ‘మహానటి’ కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదు అన్నాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను ‘సీతారామం’తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అన్నారు.

Show comments