Site icon NTV Telugu

Dude : 2 రోజుల్లో 45 కోట్లు+కొట్టేశారు డ్యూడ్

Dude

Dude

యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, కీర్తిస్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఓపెనింగ్ డేలో 22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. రెండో రోజు 23 కోట్లు+ గ్రాస్ వసూలు చేసిన ‘డ్యూడ్’, రెండు రోజుల్లో మొత్తం 45 కోట్లు+ సాధించింది. దీపావళి రిలీజ్‌లలో వరల్డ్‌వైడ్ టాప్ ఇండియన్ ఫిల్మ్‌గా ఈ చిత్రం నిలిచింది.

Also Read :‘Aryan’ Trailer :అంచనాలు రేపేలా న్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’

బుక్‌మైషోలో కూడా ఈ మూవీ అద్భుతమైన రెస్పాన్స్‌ను రాబట్టింది. కేవలం 24 గంటల్లో 231.24K టికెట్లు అమ్ముడుపోయాయి.ఓవర్‌సీస్ మార్కెట్‌లో కూడా ‘డ్యూడ్’ బలమైన ప్రదర్శన కనబరుస్తోంది. నార్త్ అమెరికాలో $500K మైలురాయిని దాటిన ఈ చిత్రం, $1 మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్, పండగ సెలవుల ప్రభావంతో ఈరోజు, రేపు మరిన్ని పెద్ద సంఖ్యలు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అత్యంత ఆశాజనకంగా ఉన్నాయి.ప్రదీప్ రంగనాథన్ యూత్ అప్పీల్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ స్థాయి, కీర్తిస్వరన్ దర్శకత్వం కలిసి ‘డ్యూడ్’ను బాక్సాఫీస్ విన్నర్‌గా మార్చాయి. దీపావళి సీజన్‌లో ఇతర రిలీజ్‌ల మధ్య కూడా ఈ మూవీ టాప్ పొజిషన్‌ను కైవసం చేసుకోవడం విశేషం. అభిమానులు, ప్రేక్షకులు ఈ ఎంటర్‌టైనర్‌ను ఆదరిస్తూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నారు.

Exit mobile version