Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Droupadi 2 Em Kone Song Controversy Chinmayi Apology Director Mohanji Response

Draupathi 2: ద్రౌపది 2పై చిన్మయి షాకింగ్ ట్వీట్

Published Date :December 3, 2025 , 9:48 pm
By Bhargav Chaganti
Draupathi 2: ద్రౌపది 2పై చిన్మయి షాకింగ్ ట్వీట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెల‌రాజె..)’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పాట నేప‌థ్యాన్ని గ‌మ‌నిస్తే.. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జ‌రుగుతుంది. అందులో హోయ‌సాల రాజ్యానికి చెందిన మ‌హారాజు వీర వ‌ల్లాల 3 (మూడ‌వ వీర వ‌ల్లాల‌ర్‌).. క‌డ‌వ‌రాయ‌న్‌కు ప‌ట్టాభిషేకం చేసి పెళ్లి చేస్తారు.

ఈ దంప‌తులు త‌ల్లిదండ్రుల‌య్యే సంద‌ర్భంలో జ‌రిగే సీమంతం వేడుక‌లో వీర వ‌ల్లాల మ‌హారాజు క‌డ‌వ‌రాయ‌న్‌కు ఓ బ‌హుమ‌తిని ఇస్తారు. ఈ సంద‌ర్భాన్ని సినిమాలో చిత్రీక‌రించిన సంద‌ర్భంలో వ‌చ్చే పాటే ‘ఏం కోనె..’. విల‌క్ష‌ణ‌మైన సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ద్రౌప‌ది 2 నుంచి రీసెంట్‌గా విడుద‌లైన ‘ఎం కోనె..’ (నెలరాజె..) సాంగ్ ట్రాక్‌కు సంబంధించిన పాట పాడిన సింగ‌ర్‌ చిన్మ‌యి శ్రీపాద చేసిన వ్యాఖ్య‌ల‌కు నెటిజ‌న్స్ నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్‌.జి స్పందించారు.

Also Read:Mega Anil : చిరు సినిమాలో షూట్ పూర్తి చేసిన వెంకటేష్

ఎం కోనె.. పాట‌ను ఆల‌పించిన సింగ‌ర్ చిన్మయి.. పాట విడుదలైన కొద్దిసేపటి తర్వాత త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పారు. రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేప‌థ్యం గురించి తాను తెలియకపోవ‌టం వ‌ల్ల పాల్గొన్నాన‌ని, ప్రాజెక్ట్ గురించి ముందే తెలుసుకుని ఉంటే తాను ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యేదాన్ని కాద‌ని ఆమె వెల్లడించారు.

చిన్మ‌యి క్ష‌మాప‌ణ చెప్ప‌టం దీనిపై చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్‌.జి స్పందించారు. ఈ పాట‌ను పాడ‌టానికి తాను ప‌ర్స‌న‌ల్‌గా చిన్మ‌యి అయితే బావుంటుంద‌ని ఆమెతో పాడించాన‌ని పేర్నొన్నారు. రికార్డింగ్ స‌మ‌యంలో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్‌ అందుబాటులో లేక‌పోవ‌టంతో తాను ట్రాక్‌కు సంబంధించిన విష‌యాల‌ను మాత్ర‌మే వివ‌రించాన‌ని, సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేశారు. త‌న‌తో కానీ, సంగీత ద‌ర్శ‌కుడితో కానీ మాట్లాడ‌కుండా, ఎలాంటి వివ‌ర‌ణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించిద‌ని చెప్పిన డైరెక్ట‌ర్‌. దీనిపై చిన్న‌యి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని లేదా ట్వీట్‌ను తొల‌గించాల‌ని కోరారు.

Don't target any Technicians, Actors, actresses and who ever work with me in #Draupathi2.. Whatever my movie speaks it's my own creation and idealogy. Your target is me.. Don't target those associated Directly or indirectly with me and my projects.. It's a kind of cowardness..

— Mohan G Kshatriyan (@mohandreamer) December 1, 2025

ఈ సంద‌ర్భంగా ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేయాల‌నుకుంటే చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను కాకుండా త‌న‌ను విమ‌ర్శించాల‌ని… సినిమా మేకింగ్‌లో భాగ‌మైన ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌టం పిరికిత‌నమ‌ని ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మోహ‌న్.జి పేర్కొన్నారు. చిన్మ‌యి త‌న మెసేజ్‌లో పేర్కొన్న వ్య‌తిరేక భావ‌జాలం గురించి ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ చిన్మ‌యి ఇంటిపేరులో శ్రీపాద అని ఉంది. అది ఆమె ఆధ్యాత్మిక భావాన్ని తెలియ‌జేస్తోంది. ఆమె ఏ భావజాల భేదాల గురించి మాట్లాడిందో తనకు స్పష్టంగా అర్థం కాలేదని ఆయ‌న తెలియ‌జేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chinmayi apology
  • chinmayi sripaada
  • Chinmayi statements
  • Director Mohan G
  • Draupathi 2

తాజావార్తలు

  • Petrol Price Hiked: వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్‌‌పై రూ.137, డీజిల్‌పై రూ.184 పెంపు

  • Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

  • MEGA 158 : చిరంజీవి – బాబీ.. యాక్షన్ కు ముహూర్తం ఫిక్స్

  • Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions