డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని అత్తని హత్య చేసి నష్టం నుంచి బయటపడాలని దృశ్యం 2 సినిమా ప్లాన్ చేశాడో కసాయి అల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్ లో బిల్డప్ ఇచ్చి చివరికి కాల యముడిలా మారాడు. అసలు ఈ ఘటన ఎలా బయటపడిందో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.
ఈ ఈనెల 7న సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని రామమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రామమ్మ అల్లుడు వెంకటేష్ 100 కి డయల్ చేసి విషయం చెప్పాడు.సమాచారం అందుకున్న పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాదమని అనుకున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో మహేంద్ర థార్ వాహనం కనపడింది. అయితే ఆ వాహనమే మహిళని ఢీ కొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. TS 18 G 2277 నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు తొగుట పోలీసులు. ఆ వాహనాన్ని సిద్దిపేటలో వెంకటేష్ కి సోదరుడి వరుస అయిన కరుణాకర్ తీసుకున్నట్టు తేలింది.ఈ క్రమంలో పోలీసులకు రామమ్మ అల్లుడుపై అనుమానం కలిగింది. వెంకటేష్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు తొగుట పోలీసులు.
Also Read:Mayasabha: వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్.. టీజర్ రిలీజ్!
వెంకటేష్ ని రెండు సార్లు ఘటనపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని పోలీసులు అడగ్గా అలాంటిది ఏమి లేదని చెప్పాడు. అయితే కరుణాకర్ ఎవరిని పోలీసులు ప్రశ్నించగా వెంకటేష్ మాట తడబడింది. ఇక తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా అసలు నిజాలు బయటపెట్టాడు అల్లుడు వెంకటేష్. తన అత్త రామమ్మని తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. వెంటనే పోలీసులు తన సోదరుడైన కరుణాకర్ ని అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారం రాబట్టారు. ఈ ఏడాది మార్చిలో వెంకటేష్ పౌల్ట్రీ ఫారం బిజినెస్, వ్యవసాయం చేసి 22 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. అలాగే కరుణాకర్ కి అప్పుగా 1.30 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు.
వ్యాపారంలో వచ్చిన నష్టం నుంచి బయట పడాలనుకున్నాడు వెంకటేష్. వికలాంగురాలైన తన అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేశాడు. తన అత్త రామమ్మ పేరుపై 60 లక్షల వరకు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడు. అలాగే ఆమె చనిపోతే మరో 5 లక్షల రూపాయలు రైతు భీమా వస్తాయని తన పేరుపై ఉన్న భూముని కూడా అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు అల్లుడు వెంకటేష్. ఓ రోజు తన సోదరుడు కరుణాకర్ ని పిలిచి తనకి ఇవ్వాల్సిన అప్పు ఇవ్వాలని అడగ్గా… కొద్దిగా సమయం కావాలని కోరాడు కరుణాకర్. వెంకటేష్ కరుణాకర్ కి ఓ ఆఫర్ ఇచ్చాడు తన అత్తని హత్య చేస్తే తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అలాగే తన అత్త ఇన్సూరెన్స్ డబ్బులలో ఇద్దరు చేరి సగం పంచుకుందామని చెప్పడంతో కరుణాకర్ ఒకే చెప్పాడు.వెంటనే హత్యకు ప్లాన్ చేశారు.
Also Read:Shreya Dhanwanthary : ముద్దు సీన్ తీసేస్తారా.. సెన్సార్ బోర్డుపై నటి ఫైర్..
ఈ నెల 7న అల్లుడు వెంకటేష్ తన అత్త రామమ్మ దగ్గరకి వెళ్ళి బావి వద్ద విద్యుత్ అధికారులు వస్తున్నారని చెప్పారు. ఆమెని టివిఎస్ ఎక్సెల్ పై మాసాన్ పల్లి శివారు లో రోడ్డు వద్ద ఆపాడు. తాను అధికారులు వచ్చారో లేదో చూసి వస్తాను రోడ్డుపైనే ఉండాలని చెప్పడంతో సరే అంది రామమ్మ. వెంకటేష్ కొద్దిగా దూరం పోగానే కరుణాకర్ కి కాల్ చేశాడు. కరుణాకర్ థార్ వాహనంపై అతివేగంగా వచ్చి రామమ్మని ఢీ కొట్టి హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఏమి తెలియనట్టు వెంకటేష్ ఘటన స్థలానికి వచ్చి తన అత్తని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చనిపోయిందని నమ్మించాడు. కానీ చివరికి పోలీసుల విచారణలో అల్లుడి బాగోతం బయటపడింది.
దృశ్యం 2 సినిమా చూసి హత్య చేసినట్టు విచారణలో ఇద్దరు నిందితులు ఒప్పుకున్నారు. అల్లుడి తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. సాంకేతికత ఆధారంగా కేసుని ఛేదించిన తొగుట పోలీసులను సిద్దిపేట సీపీ అనురాధ అభినందించారు. మొత్తానికి అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామన్న అల్లుడి ప్లాన్ బెడిసికొట్టింది. సిసి కెమెరాలు ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించాయి.
