Site icon NTV Telugu

Ram pothineni : డబుల్ ఇస్మార్ట్ కు..డబుల్ ఆఫర్..!

Untitled Design

Untitled Design

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కించిన చిత్రమే డబుల్ ఇస్మార్ట్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

కాగా డబుల్‌ ఇస్మార్ట్‌ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. తొలుత ఏరియాల వారిగా రైట్స్ సేల్ చేయాలని భావించారు నిర్మాతలు. కానీ పూరి జగన్నాధ్ గత చిత్రం లైగర్ కు సంబంధించి నిర్మాతలకు డిస్టిబ్యూటర్లకు మధ్య ఇప్పటికి తకరారు నడుస్తుంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ రైట్స్ అవుట్ రేట్ సేల్ చేసేందుకు మొగ్గు చూపారు నిర్మాత ఛార్మి. కాగా డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను రూ. 54కోట్లకు కొనుగోలు చేసారు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి సినిమా అంత రేట్ పలకడం అంటే కేవలం రామ్, పూరీల కాంబో క్రేజ్ అనే చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం థియేట్రికల్ రైట్స్ తోనే డబుల్ రూ.54 కోట్లు పలికిందంటే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. అవి కూడా భారీ ధర పలికే అవకాశం ఉండడంతో నిర్మాత పూరి, ఛార్మీలకు కాస్త గట్టిగానే గిట్టుబాటు అయ్యినట్టే లెక్క. ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసిన ఈ చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్ ఈ రోజు సాయంత్రం 5:08 గంటలకు రానుంది.

Exit mobile version