ఆగస్టు 15న 5 సినిమాలు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్, హరీష్ శంకర్ – రవితేజ ల మిస్టర్ బచ్చన్, నార్నె నితిన్ ఆయ్, మరొక డబ్బింగ్ సినిమా తంగలాన్, మరో చిన్న సినిమా 35. ఇప్పటికే హాన్ని హంగులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. అటు ప్రమోషన్స్ ఎవరికీ వారు సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
Also Read : Mahesh bday special: కోట్ల హృదయాల ‘గుండె చప్పుడు’ ఘట్టమనేని మహేష్ బాబు
ఇదంతా కాయిన్ కి ఒకవైపు మాత్రమే. రెండు వైపు వ్యవహారం ఇంకోలా జరుగుతోంది. ముక్యంగా రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ కు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. పూరి జగన్నాధ్ గత చిత్రం లైగర్ సినిమా నష్టాలకు సంబంధించి పంచాయితీ తేల్చేందుకు సిటింగ్స్ మీద సిట్టింగ్స్ వేస్తున్నారు, కానీ సమస్యకు పరిష్కారం రాలేదు. లైగర్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తనకు రావాల్సిన నష్ట పరిహారం విషయాన్ని తేల్చి అప్పుడు రిలీజ్ చేసుకోమని మొండి పట్టు పట్టాడు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ కనుక తమ సమస్య విషయం సీరియస్ గా తీసుకోకుండా డబుల్ ఇస్మార్ట్ ను రిలీజ్ చేయాలని చుస్తే మాత్రం ఊరుకునేది లేదు, అవసరమైతే ఈ నెల 15 నుంచి థియేటర్లు బంద్ చేయాలనీ, ఆ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని నైఙాం ఎగ్ఙిబిటర్ల ఆలోచన చేస్తున్నారు. అటు ఆంధ్రలో మాత్రం ఈ సినిమాకు అన్ని రూట్లు క్లియర్ అయ్యాయి. నైజాం విషయం త్వరగా తేల్చాలని లేదని డే 1 కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని రామ్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.