NTV Telugu Site icon

Double ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మధ్య విభేదాలు నిజమేనా.. ప్రమోషన్స్ కు పూరి దూరం..?

Untitled Design (64)

Untitled Design (64)

ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్‌. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Also Read: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్

కాగా ఈ చిత్ర హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్‌ మధ్య గ్యాప్ వచ్చినట్టు ఇటీవల కాలంలో అనేక వార్తలు వినిపించాయి, వాటికి మరింత బలం చేకూర్చేలా హీరో, దర్శకులు వ్యవహారిస్తున్నారు. లైగర్ వివాదం కారణంగా డబుల్ ఇస్మార్ట్ కు కొన్ని చిక్కులు వచ్చాయి. నైజాం పంపిణి వ్యవహారం ఇంకా తేలలేదు. ప్రమోషన్స్ మొదలే పెట్టెలేదు నిర్మాత ఛార్మి. దీంతో రామ్ ఎటూ తేలుచుకోలేని పరిస్థితి రావడంతో ఉన్నంతలో తానే సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ఆదివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి కూడా పూరి హాజరుకాలేదు. దింతో పూరి, రామ్ ల గ్యాప్ నిజమేనని ఆడియన్స్ నమ్మే పరిస్థితి వచ్చింది.

Also Read: Pawankalyan : పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా.. దుమ్ములేపిన నిహారిక

మరోవైపు వీడియో బైట్ రిలీజ్ చేసాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్‌. ఆ వీడియోలో ఈ ఫంక్షన్ లో మీతో పాటు నేనూ వుండాలి. కానీ సెన్సార్ కోసం ముంబైలో ఫైనల్ మిక్సింగ్ లో వుండి ఈవెంట్ కి రాలేకపోయాను. వెరీ సారీ. ఈవెంట్ కి రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానని అన్నారు. కానీ అవేవి నమ్మశక్యంగా లేవని హీరో, దర్శకుడి మధ్య గ్యాప్ నిజమేనని టాక్ నడుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ తో వీరిమధ్య గ్యాప్ తొలగిపోవాలని ఫాన్స్ కోరుతున్నారు.

Show comments