Site icon NTV Telugu

Naga Chaitanya Akkineni: నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్?

Naga Chaitanya New Movie

Naga Chaitanya New Movie

Does Naga Chaitanya Akkineni Twitter ID Hacked: గత కొద్దిరోజులుగా అనూహ్యమైన కారణాలతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ చేశారు. తాను 50 డాలర్లకు వంద బిట్ కాయిన్లను 2013లో కొనుగోలు చేశానని వాటి విలువ ఇప్పుడు ఆరు మిలియన్ డాలర్లు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గివ్ ఇవే ఇవ్వాలా వద్దా ఓటు చేయండి అంటూ ఆయన ట్వీట్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే చాలామంది ఈ మేరకు ఓటింగ్ కూడా చేస్తున్నారు. కానీ సాధారణంగా ఇలాంటి బిట్ కాయిన్ వ్యవహారాల గురించి ఎక్కువగా హ్యాక్ చేసిన తర్వాత హ్యాకర్లు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటారు.

Nayanathara: పిల్లల విషయంలో మరో వివాదంలో లేడీ సూపర్ స్టార్!

కాబట్టి ఈ ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ విషయానికి వస్తే 2.6 మిలియన్ ఫాలోవర్లతో ఈ అకౌంట్ రన్ అవుతోంది. 2017లో నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ తీసుకున్నారు. ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తోంది.

Exit mobile version