NTV Telugu Site icon

Payal Rajput : పాయల్ నటించిన మంగళవారం టీజర్ విడుదల ఎప్పుడో తెలుసా..?

Whatsapp Image 2023 06 30 At 9.09.07 Pm

Whatsapp Image 2023 06 30 At 9.09.07 Pm

హాట్ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌.. మరోసారి తన హాట్ నెస్ తో అదరగొట్టబోతుంది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఈ బ్యూటీకి ఆ రేంజ్ హిట్‌ లభించ లేదు. మరోసారి ఆ చిత్ర దర్శకుడు అయిన అజయ్‌ భూపతి రూపొందిస్తున్న `మంగళవారం` చిత్రంలో ఆమె నటిస్తుంది.ఆర్‌ఎక్స్ 100` లో చేసిన విధంగా మరోసారి ఆమె బోల్డ్ రోల్‌ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పాయల్‌ టాప్‌లెస్‌గా కనిపించి ఆశ్చర్య పరిచింది.. దీంతో ఈ సినిమాలో మరోసారి పాయల్‌ బోల్డ్ గా కనిపించబోతుందని తెలుస్తుంది.. అయితే ఆ ఫస్ట్ లుక్‌లో చూపుడు వేలిపై సీతాకోక చిలుక కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కమర్షియల్ హంగులతో ఈ `మంగళవారం` మూవీని అజయ్ భూపతి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.ఇందులో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.సైలెంట్‌ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇక విడుదలకు రెడీ అవుతుందనీ సమాచారం.ఈ క్రమంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

తాజాగా ఈ చిత్రం గురించి ఓ అప్‌డేట్‌ కూడా ఇచ్చింది యూనిట్‌. టీజర్‌ విడుదల తేదిని ప్రకటించింది. జులై 4న టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఎన్నడూ చూడని, ఎప్పటికీ మర్చిపోలేని కథని చూడబోతున్నారు అంటూ తెలిపింది యూనిట్‌. జులై 4న ఉదయం 10.30 గంటలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం.. ఈ సందర్భంగా `కళ్లలో భయం` అనే క్యాప్షన్‌ని పంచుకోవడం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పోస్టర్‌ కూడా ఎంతగానో బాగుంది.ఆర్‌ఎక్స్ 100`లో పాయల్‌ రాజ్‌పుత్‌ గ్లామరస్‌గా, బోల్డ్ గా నటిస్తూనే నెగటివ్‌ షేడ్స్‌ ని కూడా చూపించింది. హీరోయిన్‌లో అలాంటి షేడ్‌ ని వెండితెరపై చూపించడం అదే మొదటిసారి.. ఇప్పుడు `మంగళవారం` సినిమా కూడా అలాంటి ఏదో కొత్త అంశంతో తెరకెక్కించారని తెలుస్తుంది.. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వాతి గుణపాటి, సురేష్‌ వర్మ నిర్మిస్తున్నట్లు సమాచారం.కాంతార సినిమా ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

Show comments