Payal Rajput : పాయల్ నటించిన మంగళవారం టీజర్ విడుదల ఎప్పుడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. మరోసారి తన హాట్ నెస్ తో అదరగొట్టబోతుంది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఈ బ్యూటీకి ఆ రేంజ్ హిట్ లభించ లేదు. మరోసారి ఆ చిత్ర దర్శకుడు అయిన అజయ్ భూపతి రూపొందిస్తున్న `మంగళవారం` చిత్రంలో ఆమె నటిస్తుంది.ఆర్‌ఎక్స్ 100` లో చేసిన విధంగా మరోసారి ఆమె బోల్డ్ రోల్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పాయల్ టాప్‌లెస్‌గా కనిపించి ఆశ్చర్య పరిచింది.. దీంతో ఈ సినిమాలో మరోసారి పాయల్ బోల్డ్ గా కనిపించబోతుందని తెలుస్తుంది.. అయితే ఆ ఫస్ట్ లుక్‌లో చూపుడు వేలిపై సీతాకోక చిలుక కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కమర్షియల్ హంగులతో ఈ `మంగళవారం` మూవీని అజయ్ భూపతి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.ఇందులో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.సైలెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇక విడుదలకు రెడీ అవుతుందనీ సమాచారం.ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా ఈ చిత్రం గురించి ఓ అప్‌డేట్ కూడా ఇచ్చింది యూనిట్. టీజర్ విడుదల తేదిని ప్రకటించింది. జులై 4న టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఎన్నడూ చూడని, ఎప్పటికీ మర్చిపోలేని కథని చూడబోతున్నారు అంటూ తెలిపింది యూనిట్. జులై 4న ఉదయం 10.30 గంటలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం.. ఈ సందర్భంగా `కళ్లలో భయం` అనే క్యాప్షన్‌ని పంచుకోవడం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పోస్టర్ కూడా ఎంతగానో బాగుంది.ఆర్‌ఎక్స్ 100`లో పాయల్ రాజ్‌పుత్ గ్లామరస్‌గా, బోల్డ్ గా నటిస్తూనే నెగటివ్ షేడ్స్ ని కూడా చూపించింది. హీరోయిన్‌లో అలాంటి షేడ్ ని వెండితెరపై చూపించడం అదే మొదటిసారి.. ఇప్పుడు `మంగళవారం` సినిమా కూడా అలాంటి ఏదో కొత్త అంశంతో తెరకెక్కించారని తెలుస్తుంది.. పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వాతి గుణపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నట్లు సమాచారం.కాంతార సినిమా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్‌డేట్..!
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?