Site icon NTV Telugu

Vishwak Sen: ఇన్‌స్టాగ్రామ్‌ డీ యాక్టివ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా..?

Untitled Design (12)

Untitled Design (12)

విష్వక్ సేన్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఇందులో పాల్గొన్న విష్వక్.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

విశ్వక్ మాట్లాడుతూ” జేక్స్ బిజోయ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. మా సినిమా కోసం తను అందించిన సంగీతం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రతి పాట చక్కగా కుదిరింది. సినీ పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి ఇక్కడి లెక్కలు నాకు తెలియవు. నాకు కుదిరినంత వరకూ ఇతరులకు సపోర్ట్ చేయాలనే అనుకుంటా. విష్వక్ తరచూ కనిపిస్తున్నాడని ప్రేక్షకులు ఏమాత్రం బాధపడరు. నేను ఇన్‌స్టాగ్రామ్‌ లో ఉండేది అభిమానుల కోసమే. ఇన్‌స్టా డీయాక్టివేట్ చేయడానికి ఓ కారణం ఉంది. మార్చి 29 నాటికి నాకు 30 ఏళ్లు వస్తాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించా. ఇంత వయసు వచ్చినా ఫోన్ కు ఎక్కువ సమయం కేటాయించడం నచ్చలేదు. ఫోన్ పక్కన పెట్టి, పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఇన్‌స్టా డీయాక్టివ్ చేశా. సినిమా రిలీజ్ కు వారం ముందు యాక్టివేట్ చేస్తా. రిలీజ్ అయిన వారం తర్వాత డీ యాక్టివేట్ చేస్తా. ఈ సినిమాతో నేను పర్సనల్ గా  కనెక్ట్ అయ్యా. నేను పుట్టి పెరిగిందంతా మలక్ పెట్ లోనే. ఇందులో నా పాత్ర పేరు రాకీ. మాలక్ పేట్ లో ఒక కార్ గ్యారేజ్ ఓనర్ లోకల్ కార్ మెకానిక్ కథే ఇది. ఆ ప్రాంతంలో కొన్ని సన్నివేశాలు షూట్ చేశాం” అని అన్నారు.

Also Read:Dulquer Salman : లక్కి భాస్కర్ టైటిల్ ట్రాక్‌ విడుదల..

Exit mobile version