Site icon NTV Telugu

“కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్

Disha Patani's Dance for 'Kiss Me More' cover song

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఇటీవలే “రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్”లో సల్మాన్ ఖాన్‌తో కనిపించింది. ఈ సినిమాకు విభిన్నమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి “ఏక్ విలన్ రిటర్న్స్”లో నటిస్తోంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండగా… ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదలకు సిద్ధమవుతోంది. ‘కేటినా’ అనే మరో ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దిశా తన హాట్ పిక్స్ షేర్ చేసి ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. ఇటీవలే ఆమె బికినీ పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేసి హాట్ టాపిక్ కు తెర తీశాయి.

Read Also : “యూ టర్న్” హిందీ రీమేక్ కు హీరోయిన్ ఫిక్స్

తాజాగా ఈ హాట్ బ్యూటీ డోజా క్యాట్ “కిస్ మీ మోర్” సాంగ్ కు అట్రాక్టివ్ స్టెప్స్ వేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె కిల్లర్ మూమెంట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ నటి గతంలో మేరే నసీబ్ మెయిన్, వాప్, ట్యాప్ ఇన్ లతో పాటు మరిన్ని పాటలపై డాన్స్ కవర్ వీడియోలను షేర్ చేసుకుంది.

View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani)

Exit mobile version