ఇప్పుడు ఇండియాలో ఏ దిశలో చూసినా కరోనా కల్లోలమే! కానీ, ఇంతటి కరోనా సంక్షోభంలోనూ కొన్ని పాజిటివ్ వీడియోస్, ఫోటోస్, న్యూస్… నెటిజన్స్ కు కాస్తంతైనా రిలీఫ్ కలిగిస్తున్నాయి. తాజాగా దిశా పఠానీ షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో కూడా అటువంటి పాజిటివ్ వైబ్స్ నే కలిగించింది ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ కి!
ఇంతకీ, దిశా పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది? అన్ని దిశల్లోంచి కరోనా కేసులు తరుముకొస్తుండగా డాక్టర్లు మనందరి కంటే ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. అదుగో అలాంటి వారి వీడియోనే దిశా పోస్ట్ చేసింది. కొందరు డాక్టర్స్ అన్ని టెన్షన్స్ మరిచిపోయి కాస్సేపు ‘సీటీమార్’ అంటూ చిందులేశారు! దిశా పఠానీ లెటెస్ట్ మూవీ ‘రాధే’లో ఉన్న ‘సీటీమార్’ పాట బాలీవుడ్ ఆడియన్స్ లో బాగానే పాప్యులర్ అయింది. దానికే మన డాక్టర్స్ స్టెప్పులు వేశారు. ఓ డాక్టర్ చేతిలో మండోలిన్ పట్టుకుని అద్భుతంగా వాయించటం నెటిజన్స్ ను మరింత ఆకట్టుకుంటోంది!
డాక్టర్స్ ‘సిటీమార్’ పాటకి స్టెప్పులేయటం దిశాను కూడా బాగా ఆకట్టుకుంది. అందుకే, తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన ఆమె ‘వావ్’ అంటూ ఆశ్చర్యం, ఆనందం ప్రకటించింది! డాక్టర్స్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ కు దిశా ఫిదా అయిపోయింది! అఫ్ కోర్స్… ఆమె ఫాలోయర్స్ కూడా.. కరోనా వారియర్స్ కి శాల్యూట్ చేశారు!
A post shared by Team Disha (@teamdishap)