Site icon NTV Telugu

‘డియర్ కామ్రేడ్’ వల్లే రశ్మికకు బాలీవుడ్ ఛాన్స్

Director Shantanu Bagchi on Rashmika Mandanna Bollywood Debut

దక్షిణాదిన అగ్రతారల్లో ఒకరిగా రాణిస్తున్న రశ్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. నిజానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా వల్లే రశ్మికకు బాలీవుడ్ ఛాన్స్ లభించిందట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు రశ్మికను ‘మిషన్ మంజు’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్న దర్శకుడు శాంతన భాగ్చీ. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడుతూ ‘డియర్ కామ్రేడ్’లో రశ్మిక నటనను చూసి ఇంప్రెస్ అయ్యాను. నిజానికి మా సినిమాలో అమాకత్వం, అందం ఉన్న నటి కావాలి. అది తనలో కనిపించింది. జూమ్ లో స్క్రిప్ట్ చెప్పినపుడు రశ్మిక తన పాత్రయొక్క ఔచిత్యాన్ని గుర్తెరిగిందని చెబుతున్నాడు. ఇక నిర్మాత అమర్ బూటాలా కూడా సెట్ లో రశ్మిక ఎనర్జీ లెవల్స్ ని ప్రశంసిస్తున్నాడు. స్పై థ్రిల్లర్ ‘మిషన్ మంజు’లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. రశ్మిక ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే అమితాబ్ తో ‘గుడ్ బై’ సినిమా కూడా కమిట్ అవటం విశేషం. మరి ఈ రెండు ప్రాజెక్ట్ లతో రశ్మిక బాలీవుడ్ లోనూ పాగా వేస్తుందేమో చూద్దాం.

Exit mobile version