Site icon NTV Telugu

Sandeep Raj: సైలెంటుగా పెళ్లి చేసుకున్న హీరోయిన్-డైరెక్టర్

Sandeep

Sandeep

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తన ప్రేయసి, హీరోయిన్ చాందినీ రావుని సైలెంటుగా పెళ్లి చేసుకున్నాడు. తిరుమలలో వీరి వివాహం జరిగింది. పెళ్ళికి కలర్ ఫోటో హీరో సుహాస్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను సందీప్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. సందీప్‌-చాందిని వివాహం తిరుమలలో జరిగినట్టు సమాచారం. సందీప్ రాజ్ షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. ఎన్నో మంచి షార్ట్ ఫిల్మ్స్‌ చేసిన ఆయన ‘కలర్‌ ఫొటో’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు.

Borugadda Anil : మూడు రోజుల పోలీస్ కస్టడీకి బోరుగడ్డ అనిల్‌

సుహాస్‌ హీరోగా రూపొందిన కలర్‌ ఫొటో ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ హీరోగా ‘మోగ్లీ’ సినిమాను సందీప్ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానునట్లు తెలుస్తోంది. సందీప్ రాజ్ డైరెక్టర్ చేసిన కలర్ ఫొటో సినిమా, హెడ్స్ అండ్ టేల్స్ వెబ్ సిరీస్‌లో చాందిని రావు నటించారు. కలర్‌ ఫొటో చిత్రీకరణ సమయంలోనే సందీప్, చాందినిలు ప్రేమలో పడ్డారట. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి అయ్యర్. విషయం తెలిసిన నెటిజన్లు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సందీప్‌-చాందినికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version