Site icon NTV Telugu

Brahmanda : ప్రివ్యూ చూస్తూ డైరెక్టర్ మృతి.. 29న సినిమా రిలీజ్

Rambabu

Rambabu

తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు, తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాద అంశం మీకు గుర్తుండే ఉంటుంది. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47) తను డైరెక్ట్ చేసిన సినిమా ‘బ్రహ్మాండ’ ప్రివ్యూ చూస్తుండగా ఊహించని విధంగా జూలై నెలలో బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలి మరణించారు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Also Read : Google Maps: గూగుల్ మ్యాప్‌ను నమ్మితే నట్టేట ముంచింది.. ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు!

ఈ క్రమంలో నటి ఆమని మాట్లాడుతూ.. బ్రహ్మాండ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి అనుభూతిని ఇస్తుంది అని తెలిపారు. అలాగే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పారు నటి ఆమని. ఇంత మంచి సినిమా సినిమా డైరెక్ట్ చేసిన రాంబాబు గారు మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు.

Exit mobile version