Site icon NTV Telugu

Ram Gopal Varma: కృష్ణ మృతిపై ఆర్జీవీ వైరల్‌ ట్విట్‌.. బాధపడాల్సిన అవసరం లేదంటూ..

Ramgopal Varma

Ramgopal Varma

Ram Gopal Varma: గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్ కృష్ణ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. 8 విభాగాలకు చెందిన 8 మంది వైద్య నిపుణుల్ని రంగంలోకి దిగి.. ప్రపంచస్థాయి చికిత్సని అందించారు. కానీ.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, వెంటిలేటర్‌పై కన్నుమూశారు. కృష్ణ మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణ ఇక లేడన్న విషయం తెలిసి అభిమానులు సైతం కన్నీరుమున్నీరు అవుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మ‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటని, యావ‌త్ సినీ ప్రపంచం కృష్ణ మ‌ర‌ణంపై సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే అంద‌రితో పోల్చితే తాను పూర్తి డిఫ‌రెంట్ అని భావించే ద‌ర్శకుడు ఆర్జీవీ త‌న‌దైన శైలిలో స్పందించారు.

బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కృష్ణ గారు మరియు విజయనిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ ఆర్జీవీ ట్విట్‌ చేశారు. ఆట్వీట్‌ కు మోసగాళ్లకు మోసగాళ్లలోని కృష్ణ , విజయనిర్మల పాట వీడియోను జతచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆట్విట్‌ కాస్త తెగ వైరల్‌ అవుతోంది. అయితే.. ఆర్జీవీ ట్వీట్‌పై కొంద‌రు నెటిజ‌న్స్ రియాక్ట్ అయ్యారు. వ‌ర్మ చేసిన ట్వీట్‌ను ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టలేదు. కొంద‌రు అదే క‌రెక్ట్ అని అంటుంటే, అస‌లు కృష్ణగారు చనిపోలేద‌ని మ‌రొక‌రంటున్నారు. అస‌లు నువ్వు స్వర్గాన్ని న‌మ్ముతావా అని కూడా రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించిన వారు లేక‌పోలేదు. ఇక మరికొందరైతే ఇంకెందుకు ఆలస్యం నువ్వు కూడా వెళ్ళి టీ సమోసాలు అందిచేలా ఉన్నావే పురుగెత్తూ అంటూ ట్వీట్‌ చేశారు.
Prakash Raj: నటులకి ఆ భయం పట్టుకుంది.. అందుకు నేను సిద్ధమే

Exit mobile version