పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయిన ప్రభాస్ “సలార్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏకంగా 700 కోట్లకు వసూళ్లు సాదించి అదరగొట్టింది. ఇదిలా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి ” ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.
ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ ,బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కల్కి లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేష్ బాబును సంప్రదించారని తెలుస్తుంది. కల్కి లో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించనున్నాడని సమాచారం..దీనితో విష్ణు అవతారంలో ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని సమాచారం.
