Site icon NTV Telugu

Krish : 11 ఏళ్ల బిడ్డ ఉన్న డాక్టర్ తో క్రిష్ రెండో వివాహం

Director Krish

Director Krish

కొన్నాళ్ల క్రితం రమ్య అనే ఒక డాక్టర్ని డైరెక్టర్ క్రిష్ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహ బంధంలో కొన్ని సమస్యలు రావడంతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అందిన సమాచారం మేరకు డైరెక్టర్ క్రిష్ రెండో వివాహానికి రంగం సిద్ధమైంది. ఆయన వచ్చే వారం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి కూడా ఆయన ఒక డాక్టర్ని వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఆ డాక్టర్ విడాకులు తీసుకుని ఉంటున్నారని, ఆమెకి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో విషయం ఏమిటంటే క్రిష్ మాజీ భార్య రమ్య కూడా ఒక డాక్టర్ కావడమే.

Thandel : తండేల్ దుల్లకొట్టే డేట్ వచ్చేసింది

ఇక క్రిష్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చివరిగా కొండ పొలం అనే సినిమా చేసిన ఆయన హరిహర వీరమల్లు సినిమా చేస్తూ చేస్తూ తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ దొరక్క పోవడం, ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఇప్పట్లో సినిమా పూర్తి కాదనే ఉద్దేశంతో ఆయన తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఘాటి అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా తాజాగానే రిలీజ్ అయింది. మొత్తం మీద క్రిష్ జాగర్లమూడి రెండో వివాహానికి సిద్ధమవుతూ ఉన్నాడని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version