NTV Telugu Site icon

Karuna Kumar: బురదలో పడుకోమంటే పడుకున్నారు. వర్షంలో తడవడమంటే తడిశారు!

Karuna Kumar Comments

Karuna Kumar Comments

వరుణ్ తేజ్ మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కరుణ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ నేను వైజాగ్ అల్లుడిని, దొండపర్తి మా అత్తగారి ఊరు. నా గ్రోత్ ని ప్రత్యక్షంగా చూసినవాళ్లు ఈ వేడుకలో ఉన్నారు వాళ్ళందరికీ నమస్కారం.వైజాగ్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్ ని ఈ సినిమాగా చూపిద్దాం అనుకున్నా, ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదలయిన వైజాగ్ ఈరోజు ప్రపంచ పటంలో ఒక పవర్ హౌస్ గా నిలిచింది. ఇంత దూరం వచ్చిందంటే దీని వెనక చాలామంది మనుషులు ఉన్నారు. వైజాగ్ లో పుట్టి పెరిగిన వారి జీవితాలు చాలామందికి తెలియదు. ఆ జనరేషన్ ని మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దామనుకున్నా, మట్కా వైజాగ్ లో ఒకప్పుడు జరిగిన కథ. వైజాగ్ లో నైట్ క్లబ్లు ఉండేవి క్యాబరేలు ఉండేవి. అప్పటి మనుషులు, అప్పుడు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప ఎచీవ్మెంట్లు అన్నీ చూపించాలనుకున్నా, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ, వైజాగ్ లో సామ్రాజ్యాల స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్లందరి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మట్కా చేయడం జరిగింది. కథ చెప్పిన ఫస్ట్ మీటింగ్ లోనే వరుణ్ గారు ఓకే చేశారు. ఇప్పుడు నవంబర్ 14 కి మీ ముందుకు వస్తుంది. మీరంతా చూసి ఈ సినిమాని ఆశీర్వదించాలి.

Varun Tej: నువ్వు పెద్దోడివి అవొచ్చు..కానీ నీ సక్సెస్ దేనికీ పనికి రాదు.. వరుణ్ తేజ్ ఇలా అనేశాడు ఏంటి?

ఈ సినిమా గ్రోత్ గురించి మాట్లాడుతుంది. మనిషిలోని మంచి చెడు గురించి మాట్లాడుతుంది. నా మొట్టమొదటి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నేను మెగా ఫ్యాన్ ని. ఒక మెగా అభిమానిగా నేను ఈరోజు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ ని డైరెక్ట్ చేయడం నా సక్సెస్ లో ఒక మైల్ స్టోన్ అనుకుంటున్నాను. మెగా ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ వరుణ్ బాబు. ఆయన సెట్స్ లో ఎలా ఉంటారో అనే ఆలోచన ఉండేది. కానీ రెండో రోజే ఆ ఆలోచనలన్నీ పోయాయి. వరుణ్ తేజ్ గారికి శుభ్రత అంటే ఇష్టం. కానీ అలాంటి వ్యక్తి నేల మీద కూర్చోమంటే కూర్చున్నారు. బురదలో పడుకోమంటే పడుకున్నారు. వర్షంలో తడవమంటే తడిశారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్కరోజు కూడా కంప్లీట్ చేయకుండా వర్క్ చేశారు. ఈ సినిమాకు ఆయన పెట్టిన ఎఫర్ట్ నా భూతో న భవిష్యతి. ఇది నా ఆత్మ విశ్వాసంతో చెప్తున్నాను. వరుణ్ ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే మీరంతా ఆనందపడతారో, ఆయన ఎలాంటి ఫైట్లు డాన్సులు చేయాలనుకుంటున్నారో, అంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో సింగిల్ షాట్ లో ఒక సీన్ ఉంటుంది. అది తెలుగు సినిమాలో నిలబడి పోయే సీన్ అవుతుందని అన్నారు.