Site icon NTV Telugu

Atlee : డాక్టరేట్ అందుకున్న దర్శకుడు అట్లీ.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్

Tamil Director Atlee, Receives Doctorate,

Tamil Director Atlee, Receives Doctorate,

ప్రముఖ దర్శకుడు అట్లీ తన ప్రతిభతో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన జీవితంలో మరో గౌరవనీయ ఘట్టం చోటుచేసుకుంది. అట్లీకి చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో అతని శుభకాక్షలు తెలియజేస్తోంది.

Also Read : Kajol : ఫోటోగ్రాఫ‌ర్లు.. మమల్ని అక్కడ కూడా వదలడంలేదు

2025 జూన్ 14న సత్యభామ విశ్వవిద్యాలయం 34వ కాన్వొకేషన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అట్లీ కి ‘గౌరవ డాక్టరేట్’ బిరుదును అందజేశారు. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ మారియజీనా జాన్సన్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ వేడుకకు అట్లీ భార్య ప్రియ అట్లీ, ఆయన తల్లి తదితర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక అట్లీకి ఈ గౌరవం లభించిందన్న విషయం తెలియగానే టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు.. తన ట్విట్టర్‌లో ‘గౌరవ డాక్టరేట్ అందుకున్న @Atlee_dir గారికి హృదయపూర్వక అభినందనలు. మీ అభిరుచి, నైపుణ్యం ఈ స్థాయిలో జరుపుకోవడం చూసి నిజంగా సంతోషంగా ఉంది. మీరు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు కూడా అట్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 

Exit mobile version