Site icon NTV Telugu

Jaya Krishna : బోల్డ్ డైరెక్టర్‌తో ఘట్టమనేని వారసుడి ఏంట్రీ..

Jayakrishna

Jayakrishna

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం కానున్నారని, గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో జయకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో షూట్‌ బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. బ్లాక్‌సూట్‌లో మెస్మరైజింగ్‌లో లుక్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. కాగా జయకృష్ణ లండన్‌లో నటనలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే తాజాగా జయకృష్ణను తెలుగు చిత్రసీమలో ఆవిష్కరించేందుకు దర్శకుడు సిద్ధం అయ్యాడు.

Also Read : Surya : పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న #Surya 46

‘RX 100’, ‘మంగళవారం’ లాంటి చిత్రాలతో బోల్డ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి దర్శకత్వం జయకృష్ణ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించనున్నాయి. అంటే ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే అజయ్ భూపతి మాత్రం ప్రస్తుతం ‘మంగళవారం 2’తో బిజీగా ఉన్నప్పటికీ, జయకృష్ణ డెబ్యూ సినిమాను కూడా త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. కాగా ఈ సినిమా కథ యాక్షన్, ఎమోషన్‌ తో యువతను ఆకర్షించేలా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూస్తూ, కొన్ని నిర్మాణ అంశాల్లో కీలక సలహాలు ఇస్తున్నాడని సమాచారం.

Exit mobile version