NTV Telugu Site icon

Dheera: దిల్ రాజు చేతికి లక్ష్ చదలవాడ ‘ధీర’ థియేట్రికల్ రైట్స్

Dheera Making

Dheera Making

Dil Raju to Release Laksh Chadalawada’s ‘Dheera’: టాలీవుడ్ సర్కిల్‌లో దిల్ రాజుకున్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ స్థాయి మారిపోతోంది ఎందుకంటే నిర్మాతగానూ, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్ రాజుకు ఉన్న అనుభవం అటువంటిది. ఓ సినిమాను అంచనా వేయడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. అలాంటి దిల్ రాజు ప్రస్తుతం లక్ష్ చదలవాడ సినిమా హక్కులు కొనుగోలు చేశారు. నైజాం, వైజాగ్ హక్కుల్ని దిల్ రాజు తీసుకోవడంతో ధీర మీద అందరి దృష్టి మరింతగా పడింది. లక్ష్ చదలవాడ ‘ధీర’ అంటూ ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్న సంగతి తెలిసిందే. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమవుతున్నాడు.

Hanuman: ఆ విషయంలో హనుమాన్ అరుదయిన ఫీట్.. నాన్ రాజమౌళి సినిమాల్లో మొదటి ప్లేసులోకి

ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. ఇక ఆల్రెడీ ధీర గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద బజ్‌ను క్రియేట్ చేశాయి. ధీర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక దిల్ రాజు బ్రాండ్ మీద ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ఆడియెన్స్‌లోనూ ధీర మీద మరింత ఆసక్తి పెరిగింది. లక్ష్ చదలవాడ సరసన నేహా పఠాన్, సోనియా బన్సాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.