Site icon NTV Telugu

Dil Raju: నాకు తెలంగాణాలో ఉన్నవి 30 థియేటర్లే!

Dil Raju

Dil Raju

థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు తన వర్గానికి తెలంగాణాలో కేవలం 30 థియేటర్లు ఉన్నాయని అన్నారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 26 గిల్డ్ లో జరిగిన మీటింగ్ కారణంగా ఆ డిస్కషన్ కంటిన్యూ అవ్వడం వాళ్ళని రమ్మని చెప్పడానికి అడగడం జరిగింది అని అన్నారు.

Also Read:Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!

అనుకున్నది జరగకపోతే తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు ఆపాలి అని ఇండైరెక్ట్ గా అనుకున్నారు. అలా ఈస్ట్ గోదావరి జిల్లాలో మొదలైన ఈ వ్యవహారం నైజాం థియేటర్ల వరకు చేరింది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ 370 ఉంటే అందులో మా వర్గానికి చెందినవి కేవలం 30 థియేటర్లు ఉన్నాయి. ఏషియన్ సునీల్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ అండర్లో 90 థియేటర్లు ఉన్నాయి.

Also Read: Dil Raju: వివాదం అంతా సద్దుమణిగింది.. మంత్రి దుర్గేష్ కి థాంక్స్.. దిల్ రాజు కీలక ప్రకటన

మా ముగ్గురి దగ్గర మొత్తం కలిపి 120 థియేటర్లు ఉన్నాయి. మిగతా 250 థియేటర్లు యజమానులు ఇతర లీజు దారుల దగ్గర ఉన్నాయి. అయితే తెలంగాణలో కూడా థియేటర్ యజమానులు ఇబ్బందులు పడుతున్నాం అని మా తమ్ముడు శిరీష్ దృష్టికి తీసుకుని వచ్చారు. 1998 నుండి మేము కలిసి వ్యాపారం చేస్తున్నాము, మా బాధలు కూడా పట్టించుకోవాలని కోరారు. మా శిరీష్ ద్వారా నా దగ్గరకు ఈ విషయం వచ్చింది. నేను FDC చైర్మన్ కాబట్టి నా దగ్గరకు ఈ విషయం తీసుకుని వచ్చారు.

Exit mobile version