NTV Telugu Site icon

Dil Raju: ఆ రెండు సినిమాల సీక్వెల్స్ మీద కూర్చున్న దిల్ రాజు

Dilraju

Dilraju

దిల్ రాజు కెరీర్ లోనే ఏడాది అత్యంత భారీగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రం అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఇప్పుడు దిల్ రాజు పెద్ద సినిమాల జోలికి వెళ్లకుండా చిన్న సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ మధ్యనే దిల్ రాజు గతంలో చేసి సూపర్ హిట్ అందుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా రీ రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీక్వెల్ గురించి ప్రస్తావిస్తే ఒక రిపోర్టర్ ని కథ సిద్ధం చేసి తెమ్మని చెప్పారు.

Vijay : విజయ్ మీద కేసు.. ముస్లిం సంఘాల ఆగ్రహం

మరి అక్కడ ఆలోచన మొదలైందో ఏమో తెలియదు కానీ శ్రీకాంత్ అడ్డాలని కూడా సీక్వెల్ కోసం ఐడియా పిచ్ చేయమని చెప్పాడట. వరుసగా రెండు డిజాస్టర్లు అందించినా దిల్ రాజు నుంచి పిలుపు రావడంతో వెంటనే ఈ పని పెట్టినట్లుగా తెలుస్తుంది. ఒక మంచి లైన్ సిద్ధమైతే సినిమా పట్టాలెక్కడం పెద్ద విషయమేమీ కాదు. మరోపక్క శతమానంభవతి సినిమా కూడా దిల్ రాజుకి మంచి పేరు తీసుకురావడమే కాకుండా డబ్బులు కూడా తెచ్చి పెట్టింది. ఆ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న కూడా ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు. దీంతో ఆయన్ని కూడా పిలిచి దానికి కూడా ఉంటే సీక్వెల్ లైన్ ఉంటే పిచ్ చేయమని అడిగాడట. ఇక ఈ రెండు లైన్స్ ఓకే అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయడం పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు. మరి చూడాలి ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందు ఎప్పుడు వస్తాయి అనేది.