టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ నిర్మాతగా నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు సినీ పరిశ్రమకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. దర్యాప్తుకు నిపుణుల కమిటీ ఏర్పాటు
తాజాగా ఆయన ఎన్‌టీవీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్ విత్ ఎన్‌టీవీ షోలో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలకు సంబంధించి తన మనసులోని విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఫుల్ ఇంటర్వ్యూ శనివారం నుంచి అందుబాటులో ఉంటుంది. ఈలోపు ప్రోమో మీద ఒక లుక్ వేయండి.
