NTV Telugu Site icon

పవన్ కళ్యాణ్, దిల్ రాజు కాంబో రిపీట్ ?

Dil Raju Locks Pawan Kalyan Again

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో దిల్ రాజు కల నెరవేరినట్లయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కోర్ట్ డ్రామా ‘వకీల్ సాబ్’కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ‘వకీల్ సాబ్’ సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న దిల్ రాజు.. పవన్ తో మరో సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. తాజా అప్డేట్ ప్రకారం… ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసిన దిల్ రాజు ఆయనతో మరో సినిమా చేయాలని ఉందనే కోరికను వెల్లడించారట. ‘వకీల్ సాబ్’ హిట్ తో సంతోషంగా ఉన్న పవన్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న రెండవ చిత్రానికి గానూ పవన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్, దిల్ రాజు కాంబోలో రానున్న రెండవ చిత్రం 2023లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హరి హర వీర మల్లు, అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రాల షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు పవన్. ఆ తరువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాలకు పవన్ సైన్ చేశాడు.