Site icon NTV Telugu

Anil Ravipudi : దిల్ రాజు కాదు.. ‘రన్నింగ్ రాజు’

Anil Ravipudi

Anil Ravipudi

ఒక్కప్పుడు ఒక క్యారెక్టర్ కోసం వంద ఆడిషన్‌లు జరిగేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వారి టాలెంట్‌ను బయటపెడుతూ చిన్నపాటి సెలబ్రెటిలు అవుతున్నారు. దీంతో కొత్త టాలెంట్‌ను మరింత బ‌య‌టకు తీసుకురావాలి అనే నేప‌థ్యంలో నిర్మాత దిల్ రాజు ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్ లాంచ్ చేయబోతున్నారు. కాగా ఈ ‘దిల్ రాజు డ్రీమ్స్’ వెబ్‌సైట్‌ను ఈ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమానికి యువ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక దీనిపై దర్శకుడు అనిల్ ఒక స్పెష‌ల్ వీడియోను పంచుకున్నారు..

Also read : Nithin : ‘తమ్ముడు’.. పవన్ కల్యాణ్ మూవీ టైటిల్ అని వద్దన్నాను

‘నా మొద‌టి సినిమా ‘పటాస్’ తర్వాత దిల్ రాజు నిర్మాణంలోనే ‘సుప్రీమ్’ సినిమా చేశాను. అలా మొద‌లైన ఈ ప్రయాణం.. ఎఫ్‌2, ఎఫ్3, రాజా ది గ్రేట్, సంక్రాంతికి వ‌స్తున్నాం విజ‌య‌వంతంగా సాగుతుంది. దిల్ రాజు ఎప్పుడూ ఒకే చోట ఆగిపోరు. నిరంతరం కొత్తదనం కోసం పరుగులు పెడుతూ ఉంటారు. అందుకే ఆయనకు దిల్ రాజు అని కాకుండా ‘రన్నింగ్ రాజు’ అని పేరు పెడితే సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం దిల్ రాజు కొత్త టాలెంట్‌కి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే వేదిక అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అభియానం అద్భుత విజయాన్ని సాధించాలి ’ అని అనిల్ త‌న‌దైన శైలిలో చెప్పుకోచ్చాడు.

 

Exit mobile version