Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?

Janhvi Kapoor Ishan Kattar

Janhvi Kapoor Ishan Kattar

ఉన్నట్టుండి సోషల్ మీడియాలో వైరల్ జాన్వీ కపూర్ పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ కట్టర్ తో జాన్వీ పెళ్లి చేసుకున్నట్టు వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. దఢక్ అనే సినిమాతో ఇషాన్, జాన్వీ బాలీవుడ్ అరంగేట్రం చేసారు. అప్పటి నుండి ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో ఇద్దరు పెళ్లి చేసుకుందని పోస్ట్ లు వైరల్ అయ్యాయి. వైరల్ అవుతున్న వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.

ఇటీవల కొందరు సెలబ్రిటీలకు సంబంధించిన వివాహ వేడుక ఫొటోలు అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతుండటంతో అభిమానుల్లో మరియు నెటిజన్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తలపై స్పందించిన సంబంధిత బ్రాండ్ నిర్వాహకులు ఆ పుకార్లకు చెక్ పెట్టారు. వైరల్ అవుతున్న ఫొటోలు మరియు వీడియోలు నిజమైన పెళ్లికి సంబంధించినవి కాదని మేకర్స్ స్పష్టం చేశారు. అవి ‘KALKI Bride & Groom Couture ’26’ బ్రాండ్ ప్రమోషనల్ షూట్ లో భాగమని వెల్లడించారు. బ్రాండ్ అంబాసిడర్లుగా కొత్త వెడ్డింగ్ కలెక్షన్ డిజైన్లను ప్రదర్శించే క్రమంలో తీసిన షూట్ పిక్స్‌ను కొందరు నిజమైన వివాహ ఫొటోలుగా ప్రచారం చేశారని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవాలను మరియు వదంతులను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బ్రాండ్ ప్రమోషన్‌ను వేరే రకంగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ క్లారిటీతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పెళ్లి రూమర్లకు ముగింపు పడింది.