Aryan Just Ignore Ananya: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అంటే తెలియని వారుండరు. నిజం చెప్పాలంటే ఆర్యన్ పబ్లిక్ లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇక అనన్య షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్‌కు మంచి దోస్త్. షారుఖ్ నివాసంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అనన్య హాజరువుతుంది. ఈవిషయం ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో నూ అనన్య ఈ విషయాన్ని తెలిపింది. అంతేకాదు తనకు ఆర్యన్ అంటే ఇష్టమనీ చెప్పారు. ఇదంతా బాగానే వుంది. అయితే తాజాగా ఆర్యన్ ఓ బాలివుడ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. అంతేకాదు బీటౌన్ నటీనటులతో కలిసి సినిమాను ఎంజాయ్ చేశారు. అయితే.. ఆసమయంలో అక్కడే ఉన్న నటి అనన్యపాండేను ఆర్యన్ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Read also: Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?
అమోజాన్ ప్రైమ్ వేదికాగా అక్టోబర్ 6 నుంచి మజామా సినిమా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటి మాధురీదీక్షిత్ ప్రధాన పాత్రలో నటించింది. బీటౌన్ సెలబ్రెటీల కోసం ముంబయిలోని ఓమాల్ లో మజామా స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అయితే ఈకార్యక్రమానికి ఆర్యన్‌ఖాన్, నటి అనన్యపాండే, కరణ్ జోహార్, మనీశ్ మల్హోత్ర హాజరయ్యారు. ఈస్క్రీనింగ్ చూడటానికి వెళ్లే ముందు థియేటర్ బయట అనన్య నిలబడివుంది. అక్కడే నుంచే వెళుతున్న ఆర్యన్, అనన్యను చూసి చూడనట్టు మొహం తిప్పుకుని అలా వెళ్లిపోయాడు. అనన్య చూస్తున్న ఆర్యన్ మొహంలో చిన్న చిరునవ్వు కూడా కనిపించలేదు. దీంతో అనన్య పాపం అలా చూస్తూ పక్కకు కాస్త జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది. ఈవీడియో పై నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అయ్యో అనన్య పాపం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.