Site icon NTV Telugu

Bison : ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Bisson

Bisson

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటించిన తాజా చిత్రం ‘బైసన్’ ఇటీవల దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను ప్రతిభావంతుడైన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించారు. తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 24న విడుదలైన ఈ చిత్రం రెండు భాషల్లోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ధ్రువ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ‘బైసన్’ నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా డిజిటల్‌గా స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

Also Read : S. S. Rajamouli : షేక్‌పేట్‌లో ఓటు హక్కు వినియోగించిన రాజమౌళి దంపతులు

ఈ సినిమాలో ధ్రువ్‌తో పాటు రజిషా విజయన్ (అక్కగా), అనుపమ పరమేశ్వరన్ (హీరోయిన్‌గా), పశుపతి (తండ్రిగా) కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు అమీర్, నటుడు లాల్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. సంగీతం నివాస్ కే. ప్రసన్న అందించగా, సినిమాను పా. రంజిత్ స్వంత బ్యానర్ నీలం ప్రొడక్షన్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, శాంతి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఒక గ్రామానికి చెందిన పేద కుర్రాడు కబడ్డీ ఆట ద్వారా అర్జున్ అవార్డు స్థాయికి ఎలా ఎదిగాడో చూపించే ఈ స్పూర్తిదాయక కథ ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Exit mobile version