NTV Telugu Site icon

Dhoom Series : ధూమ్ – 4లో నటించే స్వీట్ దొంగ ఎవరంటే..?

Untitled Design (9)

Untitled Design (9)

బాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ సిరీస్ లలో ధూమ్ సిరీస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా వైజ్ గా ధూమ్ సిరీస్ కు విరితమైన ఫ్యాన్ బేస్ ఉంది. మరి ముఖ్యంగా ఈ సిరీస్ లోని హీరో కమ్ విలన్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ధూమ్ సిరీస్ లోని దోపిడీ సీన్స్ ఎంత ఫెమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ధూమ్ సిరీస్ లో ఉండే మ్యాజిక్ ఏంటంటే ఈ సిరీస్ లో వచ్చే సినిమాలలో హీరోలంటూ ఉండరు. విలన్ క్యారెక్టర్ కు హీరోయిజం జోడించి తెరకెక్కించడం ధూమ్ సిరీస్ స్పెషల్.

Also Read : ArshadWarsi : మరోసారి ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు..

ధూమ్ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ లో జాన్ అబ్రహం, ధూమ్ 2 లో హృతిక్ రోషన్ , ధూమ్ -3 లో అమీర్ ఖాన్ విలన్ రోల్ లో కనిపించారు. ఈ మూడింటిలో ధూమ్ 2 లో హృతిక్ చేసిన విన్యాసాలకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. ఇక ఈ సిరీస్ లో భాగంగా ధూమ్ – 4 ను తెరకెక్కించేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ వర్క్ స్టార్ట్ చేసింది. కాగా అందరిలోను ఒకటే డౌట్ ధూమ్ – 4లో విలన్ రోల్ లో కనిపించే హీరో కమ్ విలన్ ఎవరు అనేది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధూమ్ 4 లో చాక్లెట్ బాయ్ రన్ బీర్ కపూర్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించి కథ చర్చలు ముగిసాయి, త్వరలోనే అధికారక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.  ఇదే జరిగితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం అనే చెప్పాలి.