మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని “పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు సుమన్ మాట్లాడుతూ ఇందులో వితిక చేసిన క్యారెక్టర్ కోసం ఓ పెద్ద ఆర్టిస్ట్ చుట్టూ డైరెక్టర్ చాలా ఏళ్లు తిరిగాడు. సినిమా చూశాక నాలాగే మీరు ఫీల్ అవుతారు, ఆమె అన్‌లక్కీ అండ్ వితిక లక్కీ అని. ఇందులో హీరోగా చేసిన నటరాజ్ నా మిత్రుడు, తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్‌గా చేసిన సత్య కొడుకు. ఈ సినిమా మీద నేను ఎందుకు నమ్మకంగా ఉన్నాను అంటే, డైరెక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాడు. నిజానికి డెబ్యూ డైరెక్టర్‌కి ఆ ‘నో కాంప్రమైజ్’ అనే మైండ్‌సెట్ ఉండాలి, అప్పుడే మంచి చిత్రాలు వస్తాయి. ఆర్టిస్ట్ శివ పెర్ఫార్మెన్స్ చూస్తే భయమేస్తుంది. ఆ సీన్స్ నిజానికి ఏ ఆర్టిస్ట్ చేయడానికీ ధైర్యం చేయలేడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే, తమిళ విజయ్ పొలిటికల్ కెరీర్‌ను పోలి ఉన్నాయి ఏంటి అనుకుంటారు. కానీ నిజానికి ఆయన సీఎం అవ్వకముందే ఈ సినిమా చేశాము.
ఇలా గతంలో ‘నేటి భారతం’ లాంటి సినిమాలు టి. కృష్ణ గారు చేసేవారు. ఆయనలాగే ఈ డైరెక్టర్ కూడా చాలా దూరదృష్టితో యూత్ డ్రగ్స్‌కు బానిస కావడం, రాజకీయ నాయకులకు మంచి మెసేజ్ ఇచ్చే సీన్స్‌తో ఈ సినిమా తీశారు. నిజానికి సినిమా వ్యాపారం అంటే లాస్ అని అంటుంటారు. ఏ వ్యాపారం ఉంటుంది చెప్పండి, లాస్ అనేది రాకుండా? నేను ఏ సినిమాను ఇంతసేపు నిలబడి ప్రమోట్ చేయలేదు. కానీ ఈరోజు చేస్తున్నాను అంటే నాకు డైరెక్టర్ మీద కలిగిన నమ్మకం, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సే కారణం అన్నారు. సాయికుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల , కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు ఈ సినిమాలో నటించారు.

