Dharani I Love You : ‘మగధీర’కు పని చేసిన జక్కన్న శిష్యుడి కొత్త సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్.ఎస్. రాజమౌళి స్కూల్ నుంచి వచ్చిన టెక్నీషియన్లపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన అద్భుత దృశ్యకావ్యం ‘మగధీర’ చిత్రానికి రాజమౌళి దగ్గర అసోసియేట్‌గా పని చేసిన సాయికృష్ణ కె.వి.. ఇప్పుడు మెగాఫోన్ పట్టి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ధరణి ఐ లవ్ యు’. దర్శకుడిగా సాయికృష్ణకు ఇది రెండో చిత్రం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ‘బేబీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ (SKN) చేతుల మీదుగా హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో ఎస్కేఎన్ మాట్లాడుతూ.. సినిమా పోస్టర్ చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశారని, ‘ధరణి ఐ లవ్ యు’ అనే టైటిల్ వినగానే స్టోరీ ఏంటన్న క్యూరియాసిటీ కలుగుతోందని ప్రశంసించారు. రాజమౌళి గారి లాంటి టాప్ డైరెక్టర్ స్కూల్ నుంచి వచ్చిన సాయికృష్ణకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, నిర్మాత రాజశేఖర్‌తో పాటు ఎంటైర్ టీమ్‌కు తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.
బేబీ, చెన్నై లవ్ స్టోరీ లాంటి వరుస విజయాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఎస్కేఎన్ చేతుల మీదుగా తమ సినిమా పోస్టర్ విడుదల కావడం ఎంతో ఆనందంగా ఉందని దర్శకుడు సాయికృష్ణ కె.వి సంతోషం వ్యక్తం చేశారు. “ఎస్కేఎన్ గారికి ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మా చిన్న సినిమాను ప్రోత్సహించడానికి వచ్చినందుకు థాంక్స్. స్టేజ్ మీద ఆయన రైమింగ్, టైమింగ్‌తో ఇచ్చే స్పీచ్‌లకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.. అందులో నేను కూడా ఒకడిని” అంటూ దర్శకుడు తన అభిమానాన్ని చాటుకున్నారు.
Also Read
ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని హీరో వంశీ, హీరోయిన్ మహిత, నిర్మాత రాజశేఖర్ మద్దికుంట ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తామన్నారు. శ్రీమతి బాలామణి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి పద్మనాబ్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, చిన్నయోగి అన్నెం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నందమూరి హరి, ఎన్టీఆర్ ఎడిటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. బేబీ ప్రొడ్యూసర్ సపోర్ట్, మగధీర టెక్నీషియన్ డైరెక్షన్.. ఈ రెండు అంశాలు ఇప్పుడు ‘ధరణి ఐ లవ్ యు’ సినిమాపై సినీ వర్గాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!